ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 1:32 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

భీమారంలో ముగిసిన ‘హమ్ బంజార’ టోర్నమెంట్:

భీమారం(మంచిర్యాల),అర్జున్ సమాచారం, జూలై 13:
భీమారం మండల కేంద్రంలో గత 20 రోజులుగా ఉత్సాహభరితంగా సాగుతున్న ‘హమ్ బంజార’ క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం నాడు ఘనంగా ముగిసింది. ఆర్.కె ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం నాడు అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది.
ఈ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథులుగా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ రాజా రమేష్, ఆర్.కె ఫౌండర్ భూక్య రాజ్ కుమార్ నాయక్ హాజరయ్యారు. ఉత్సాహంగా సాగిన ఫైనల్ పోరులో ‘కుమార్ -11’ జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది. రన్నరప్‌గా ‘ఎవర్ గ్రీన్’ జట్టు నిలిచింది.
విజేతగా నిలిచిన కుమార్-11 జట్టుకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రథమ బహుమతి రూ. 30,000/- నగదుతో పాటు ట్రోఫీని అందజేశారు. అలాగే రన్నరప్‌గా నిలిచిన ఎవర్ గ్రీన్ జట్టుకు ద్వితీయ బహుమతిగా రూ. 20,000/- నగదు పురస్కారాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఇలాంటి టోర్నమెంట్లు ఎంతగానో దోహదపడతాయని, ఆర్.కె ఫౌండేషన్ చేస్తున్న ఇలాంటి సేవా, క్రీడా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో చెన్నూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్, లంబాడిపల్లి సర్పంచ్ మహేష్, సర్వంపేట సర్పంచ్ రాజేష్ నాయక్, లైవ్ అధ్యక్షులు గుగులోత్ సమ్మయ్య నాయక్, బాపు నాయక్, రాజ్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీటీసీ జలంపల్లి తిరుపతి, మాజీ ఎంపీటీసీ రాము , భూక్య రాజేష్ నాయక్, నవీన్, సారయ్య తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు, స్థానిక యువత పాల్గొన్నారు.